రాజేంద్రనగర్‌లోనే చిరుత తిష్ఠ!

రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వర్సిటీ, జాతీయ వ్యవసాయ విస్తరణ పరిశోధనా సంస్థ(నార్మ్‌) పరిసరాల్లోని అటవీ ప్రాంతంలోనే చిరుత

Updated : 30 May 2020 08:37 IST

రాజేంద్రనగర్‌: రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ వర్సిటీ, జాతీయ వ్యవసాయ విస్తరణ పరిశోధనా సంస్థ(నార్మ్‌) పరిసరాల్లోని అటవీ ప్రాంతంలోనే చిరుత తలదాచుకుందని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. గురువారం సీసీ కెమెరాల్లో చిరుత సంచరించిన దృశ్యాలు నమోదుకావడంతో శుక్రవారం ఉదయం రాజేంద్రనగర్‌ పోలీసులు, అటవీశాఖ అధికారులు అక్కడి ప్రదేశాన్ని పరిశీలించారు. చిరుత పాదముద్రలను గుర్తించారు. ఈనెల 14న మైలార్‌దేవ్‌పల్లిలో కనిపించిన చిరుత అక్కడి నుంచి ఈ ప్రాంతానికి చేరుకుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అటవీ ప్రాంతంలో ఉన్నందున ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరంలేదని అధికారులు తెలిసింది. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కదిలికలు గమనిస్తూ, జనాల్లోకి వచ్చే అవకాశాలుంటేబంధించే విషయంపై ఆలోచించనున్నట్లు పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని