వలస కూలీల కోసం 99 ఏళ్ల బామ్మ తపన

కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయాలనే ఈ బామ్మగారి సంకల్పానికి, తపనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Published : 30 May 2020 22:28 IST

ముంబయి: కరోనా వైరస్‌ కారణంగా వందలు, వేల కిలోమీటర్లు నడిచి వెళ్లున్న వలస కార్మికుల గురించి, వారి కష్టాల గురించి రోజూ వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. అయితే, ఈ సంగతి తెలుసుకుని ఊరుకోకుండా శత వసంతాలకు చేరవవుతున్న ఉన్న ఓ బామ్మగారు చేసిన పని నలుగురికీ స్ఫూర్తి నింపుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ముంబయికి చెందిన ఓ 99 ఏళ్ల వృద్ధురాలు వలస కార్మికుల కోసం ఎంతో శ్రద్ధగా ఆహార పొట్లాలను తయారు చేయటం వీడియోలో కనిపిస్తోంది. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయాలనే ఈ బామ్మగారి సంకల్పానికి, తపనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆ వీడియో మీరూ చూసేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని