ప్రయాణికులు ఇవి పాటించాలి: ద.మ.రైల్వే
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యేక రైళ్లలో ప్రయాణించాలనుకునే వారికి దక్షిణ మధ్య రైల్వే (ద.మ.రైల్వే) పలు సూచనలు చేసింది. ఈ మేరకు ద.మ.రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. రైలు
హైదరాబాద్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యేక రైళ్లలో ప్రయాణించాలనుకునే వారికి దక్షిణ మధ్య రైల్వే (ద.మ.రైల్వే) పలు సూచనలు చేసింది. ఈ మేరకు ద.మ.రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. రైలు బయలుదేరడానికి 90 నిమిషాల ముందే స్టేషన్కు రావాలని ప్రయాణికులకు సూచించింది. టికెట్లు ఉన్నవారిని మాత్రమే రైల్వే ప్రాంగణం, రైళ్లలోకి అనుమతిస్తామని స్పష్టం చేసింది. కరోనా లక్షణాలు ఉన్న ప్రయాణికులను ఎట్టిపరిస్థితుల్లో రైళ్లలోకి అనుమతించేది లేదని పేర్కొంది. అలాగే ఏసీ కంపార్ట్మెంట్లలోని ప్రయాణికులకు దుప్పట్లు ఇవ్వబోయేది లేదని తెలిపింది. ప్రయాణికులు కనీస సామాన్లతోనే ప్రయాణించాలని.. ఆరోగ్య సమస్యలున్నవారు ప్రయాణం చేయకపోవడమే మంచిదని సూచించింది. గర్భిణీలు, పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్ల వయసు దాటిన వారు ప్రయాణించొద్దని కోరింది. రైళ్లలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని.. రైల్వే ప్రాంగణాలు, రైళ్లను శుభ్రంగా ఉంచేందుకు రైల్వే శాఖకు సహకరించాలని ద.మ.రైల్వే కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం