అంతరిక్షంలో ఆటబొమ్మ! ఎలావెళ్లిందంటే..

క్రూ డ్రాగన్‌ అంతరిక్ష యాత్రకు సంబంధించిన ఓ విశేషం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.

Published : 02 Jun 2020 01:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాకు చెందిన వ్యోమగాములు డగ్‌ హర్లీ, బాబ్‌ బెంకెన్‌లు అంతరిక్ష నౌక క్రూ డ్రాగన్‌ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరిన సంగతి తెలిసిందే. దీనితో మానవులను రోదసిలోకి తరలించిన తొలి ప్రైవేటు సంస్థగా అమెరికన్‌ సాంకేతిక దిగ్గజం స్పేస్‌ ఎక్స్‌ చరిత్ర సృష్టించింది. ఈ అంతరిక్ష యాత్రకు సంబంధించిన వీడియోలను ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వీక్షించారు. అయితే, దీనిలో ఓ విశేషం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఆ వీడియోల్లో కనబడిన ఓ డైనోసార్‌ బొమ్మ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది.
దీనిని గురించి వ్యోమగాముల్లో ఒకరైన బెంకెన్‌ మాట్లాడుతూ...  ‘జీరో గ్రావిటీ ఇండికేటర్‌’గా వాడేందుకు దానిని తన కుమారుడి వద్ద నుంచి తీసుకున్నానని వివరణ ఇచ్చారు. అంతరిక్ష ప్రయాణాల్లో ఆటబొమ్మలను తీసుకెళ్లటం ఇదే తొలిసారి కాదు. మార్చి 2019లో జరిగిన ప్రయోగాత్మక మానవ రహిత క్రూ డ్రాగన్‌ అంతరిక్ష యాత్రలో...భూగోళం ఆకారంలో ఉన్న ఓ స్టఫ్డ్ టాయ్‌ని ఉపయోగించినట్టు స్పేస్‌ ఎక్స్‌ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ తెలిపారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని