Updated : 02 Jun 2020 12:45 IST

నిమ్మగడ్డ కేసులో కామినేని కేవియట్‌ పిటిషన్‌

దిల్లీ: నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ వ్యవహారంపై భాజపా నేత, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఎస్‌ఈసీ మార్పు వ్యవహారంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్‌లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో   కామినేని కేవీయట్‌ పిటిషన్‌ వేశారు. రమేశ్‌ కుమార్‌ తొలగింపు వ్యవహారంలో కామినేని హైకోర్టులోనూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన విషయం తెలిసిందే. భాజపా కేంద్ర నాయకత్వం అనుమతితోనే సుప్రీంకోర్టులో తాను కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసినట్టు కామినేని తెలిపారు. ఇదే అంశంపై ఇప్పటికే కాంగ్రెస్‌ కాంగ్రెస్‌ నేత మస్తాన్‌వలీ కూడా కేవియట్‌ పిటిషన్‌ వేశారు.

హైకోర్టులో పిటిషన్‌ ఉపసంహరించుకున్న ప్రభుత్వం 
అమరావతి: నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ కేసులో స్టే ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను   ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసినందున హైకోర్టులో పిటిషన్‌ ఉపసంహరించుకుంటున్నట్టు విచారణలో తెలిపింది. హైకోర్టు తీర్పు అమలుపై స్టే కోరుతూ నిన్న సుప్రీంకోర్టును ఆశ్రయించామని ప్రభుత్వం తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts