విద్యుత్‌ తీగలపై నడిచి.. చెట్టుకొమ్మని తీసి

ఈదురు గాలులకు విద్యుత్‌ తీగలపై పడిన చెట్టుకొమ్మను తొలగించడానికి ఓ కాంట్రాక్ట్‌ ఉద్యోగి సాహసం చేశాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్‌ మండలం నిజాంపూర్‌లో గాలి ఉద్ధృతికి ఓ చెట్టు కొమ్మ విద్యుత్‌ తీగలపై పడింది. సమాచారం అందుకున్న విద్యుత్‌ సిబ్బంది అక్కడికి

Published : 03 Jun 2020 02:02 IST

సాహసం చేసిన కాంట్రాక్ట్‌ ఉద్యోగి

నిజాంపూర్‌: ఈదురు గాలులకు విద్యుత్‌ తీగలపై పడిన చెట్టుకొమ్మను తొలగించడానికి ఓ కాంట్రాక్ట్‌ ఉద్యోగి సాహసం చేశాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్‌ మండలం నిజాంపూర్‌లో గాలి ఉద్ధృతికి ఓ చెట్టు కొమ్మ విద్యుత్‌ తీగలపై పడింది. సమాచారం అందుకున్న విద్యుత్‌ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగి నూర్‌.. స్తంభం ఎక్కి విద్యుత్‌ తీగలపై నడుచుకుంటూ వెళ్లి కొమ్మను తొలగించాడు. ఆ యువకుడు క్షేమంగా కిందికి దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ఇంతటి ప్రమాదకర పని చేయించడంపై విద్యుత్‌ అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని