ముంబయికి పొంచివున్న మరో మప్పు

కరోనాతో అతలాకుతలమవుతున్న ముంబయిని నిసర్గ తుపాను రూపంలో మరో విపత్తు పొంచి ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం...

Updated : 02 Jun 2020 15:04 IST

ముంబయి: కరోనాతో అతలాకుతలమవుతున్న ముంబయికి నిసర్గ తుపాను రూపంలో మరో విపత్తు పొంచి ఉంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం ఈ మధ్యాహ్నానికి తీవ్ర వాయుగుండంగా మారనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో ఆరు గంటల్లో తీవ్ర వాయుగుండం ..తుపానుగా మారనుందని తెలిపింది. నిసర్గ తుపాను రేపు మధ్యాహ్నం ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్‌లో తీరం దాటే అవకాశముందని అధికారులు తెలిపారు. 

తూర్పు మధ్య అరేబియా సముద్రంలో గోవాకు నైరుతి దిశలో 280 కి.మీ దూరంలో, ముంబయికి 490 కి.మీ, సూరత్‌కు 710 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. తుపాను తీరాన్ని తాకే సమయానికి గాలులు గంటకు 105 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో  వీస్తాయన్న వాతావరణశాఖ ముంబయిపై తుపాను ప్రభావం అధికంగా ఉందని హెచ్చరించింది. వాతావరణశాఖ తుపాను హెచ్చరికల నేపథ్యంలో గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌ ప్రభుత్వాలు హై అలర్ట్‌ ప్రకటించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని