పేలుడు ఘటనపై విచారణ జరిపించాలి: బండి

పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి ఓసీపీ-1 గనిలో జరిగిన భారీ పేలుడులో నలుగురు కార్మికులు దుర్మరణం చెందిన ఘటనపై విచారణ...

Published : 03 Jun 2020 10:52 IST

కరీంనగర్‌: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని సింగరేణి ఓసీపీ-1 గనిలో జరిగిన భారీ పేలుడులో నలుగురు కార్మికులు దుర్మరణం చెందిన ఘటనపై విచారణ జరిపించాలని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ కోల్‌ మైన్స్‌ సేఫ్టీ అధికారులు తక్షణమే జరిపి నివేదిక ఇవ్వాలన్నారు. మృతి చెందిన కార్మికులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేటు ఓబీ కాంట్రాక్టర్లు ..సింగరేణిలో అధికారులకు అక్షయపాత్రగా మారారని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు కేటాయించిన  పనులపై పర్యవేక్షణను సింగరేణి  అధికారులు, యాజమాన్యం పట్టించుకోవటం లేదని విమర్శించారు. కమీషన్లకు కక్కుర్తిపడి నిబంధనలు గాలికి వదిలేయడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సింగరేణి ఓబీ పనుల్లో అధికార పార్టీ నేతలు బినామీలతో కాంట్రాక్టు పనులుచేయిస్తున్నారని బండి సంజయ్‌ ఆరోపించారు. సింగరేణిలో పేలుడు ఘటనపై కేంద్రమంత్రులకు ఫిర్యాదు చేస్తున్నట్ట చెప్పారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని