ఫిట్‌నెస్‌ బ్యాండ్‌తో ఫిట్ అవ్వండి

బాడీ ఫిట్‌నెస్‌ కోసం చాలా మంది ఆరాటపడుతుంటారు. ఫిట్‌గా ఉంటేనే ఏదైనా పనిని ఉత్సాహంగా, చలాకీగా చేయగలం. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఫిట్ ఇండియా

Published : 04 Jun 2020 23:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్: శరీరాన్ని దృఢంగా ఉంచుకునేందుకు చాలా మంది ఆరాటపడుతుంటారు. ఫిట్‌గా ఉంటేనే ఏదైనా పనిని ఉత్సాహంగా, చలాకీగా చేయగలం. ఫిట్‌నెస్‌ కోసం వయస్సుతో సంబంధం లేకుండా అందరూ తమకు తోచిన విధంగా కసరత్తులు చేస్తుంటారు. కొందరు జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తే.. మరికొందరు యోగా, రన్నింగ్, జాగింగ్‌ చేస్తుంటారు. ఇంకొందరు షటిల్‌, టెన్నిస్‌ లాంటి ఆటలతో కేలరీలను కరిగించుకుంటారు. అయితే కొంత మంది టార్గెట్స్‌ ఉంటేనే వర్కవుట్స్‌ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు. నిర్దేశిత సమయంలోనే కసరత్తులు పూర్తి చేసేలా ప్లాన్‌ చేసుకుంటారు. ఇలాంటి వారి కోసం ప్రస్తుతం ఫిట్‌నెస్‌ బ్యాండ్స్‌ బాగా ప్రయోజనకరంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఫిట్‌నెస్‌ బ్యాండ్‌తో వచ్చే లాభాలు.. ఉపయోగాలు గురించి మీరూ తెలుసుకోండి.

నిద్రపై నిఘా

మానసికంగా.. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే సరైనంత సమయం నిద్ర పోవాలి. సాధారణంగా రోజులో ఐదు నుంచి ఎనిమిది గంటల వరకు మనం నిద్ర పోతుంటాం. అయితే ఇందులో ఎంతసేపు మీరు గాఢంగా నిద్ర పోయారు.. ఎంతసేపు కలత నిద్రలో ఉన్నాం లాంటి విషయాలను ఫిట్‌నెస్ బ్యాండ్‌తో ట్రాక్‌ చేయొచ్చు. దీనివల్ల మీరు ఎంతసేపు హాయిగా నిద్రపోయారో ఇట్టే తెలుసుకునే వీలు చిక్కుతుంది. ఫలితంగా మీ నిద్రపై మీరు నిఘా వేసిన వారవుతారు. 

కేలరీలను లెక్కేయండి

మనం తిన్న ఆహారం కేలరీల రూపంలో శరీరానికి శక్తి అందిస్తుంది. ఒకవేళ ఇవి శరీర అవసరానికి మించి ఉంటే  కొవ్వు రూపంలో నిల్వ‌ అవుతాయి.  మళ్లీ శరీరానికి అవసరమైనప్పుడు ఈ ఎక్స్‌ట్రా కేలరీలు శక్తిని అందిస్తాయి. అయితే ఎక్కువగా పేరుకు పోయిన కేలరీలను కరిగించకపోతే మనిషి లావైపోతాడు. ఎప్పటికప్పుడు వర్కవుట్స్‌ చేస్తూ అదనపు కేలరీలను కరిగించాలి. ఒకరోజులో మీరు చేసిన వ్యాయామం వల్ల ఎన్ని కేలరీలు కరిగాయో ఫిట్‌నెస్ బ్యాండ్‌ లెక్కిస్తుంది. దీనివల్ల మీలో ఎక్కువగా కేలరీలను కరిగించాలన్న కోరిక పెరుగుతుంది. అంతేకాకుండా మీరు ఎంతదూరం నడిచిన విషయం కూడా బ్యాండ్స్ తెలుపుతాయి. 

టార్గెట్స్‌ పెట్టుకోవచ్చు

ఫిట్‌నెస్‌ బ్యాండ్‌తో లక్ష్యాలను నిర్దేశించుకోవచ్చు. ఎంత దూరం నడవాలి.. ఎంత సేపు వర్క్ అవుట్స్‌ చేయాలో సెట్ చేసుకోవచ్చు. దీనికోసం మొబైల్‌లో బ్యాండ్‌కు సంబంధించిన అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. బ్లూటూత్‌ కనెక్టివిటీ ద్వారా ఎప్పటికప్పుడు యాప్‌లో సెట్టింగ్స్‌ను మార్చుకోవచ్చు. వీటితో పాటు ఫిటినెస్‌ బ్యాండ్‌ ద్వారా హార్ట్ బీట్‌ రేట్‌ను తెలుసుకోవడం, మొబైల్‌ కాల్స్ను మేనేజ్‌ చేయడం, వాట్సాప్‌ మెసేజ్‌లను నోటిఫికేషన్‌ రూపంలో చూడడం, అలారమ్‌ను సెట్ చేసుకోవడం లాంటి ఆప్షన్స్‌ పొందవచ్చు. ఇలా ఫిట్‌నెస్‌ బ్యాండ్‌తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని