టీఎస్‌ ‘పది’ పరీక్షలపై హైకోర్టుకు నివేదిక

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ పదో తరగతి పరీక్షల నిర్వహణకే సిద్ధం అవుతున్నారా? అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పదో తరగతి పరీక్షలపై జస్టిస్‌ ఆర్.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్ విజయసేన్‌....

Updated : 04 Jun 2020 16:10 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ పదో తరగతి పరీక్షల నిర్వహణకే సిద్ధం అవుతున్నారా? అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పదో తరగతి పరీక్షలపై జస్టిస్‌ ఆర్.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్ విజయసేన్‌ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. ఈనెల 8 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చని గతంలో హైకోర్టు సూచించిన విషయం తెలిసిందే. ఈనెల 3న పరిస్థితిని 
సమీక్షించి.. కరోనా తీవ్రత ఎక్కువగా ఉంటే పరీక్షలకు ముందుకెళ్లవద్దని ఉన్నత న్యాయస్థానం గతంలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కరోనా నివారణ జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ న్యాయస్థానానికి  నివేదించారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లాల వారీగా చేసిన ఏర్పాట్లను వివరిస్తూ నివేదిక సమర్పించారు. ఏర్పాట్లకు సంబంధించిన వీడియో ప్రెజెంటేషన్‌ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కోర్టుకు తెలియజేశారు. వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదా వేసింది.

ప్రభుత్వ నివేదికలోని అంశాలు..

* పదో తరగతి పరీక్ష కేంద్రాలను 2,530 నుంచి 4,535కి పెంచాం
* విద్యార్థులకు కొత్తగా హాల్ టికెట్లు ఇవ్వడం లేదు
* విద్యార్థులకు పరీక్షా కేంద్రాల వివరాలు తెలియజేశాం
* థర్మల్ స్క్రీనింగ్ కిట్లు, మాస్కులు, గ్లౌజులు పరీక్షా కేంద్రాలకు తరలించాం
కేంద్రానికి ఒకరు చొప్పున 4,535 మంది వైద్య సిబ్బందిని నియమించాం

* డీఈవో కార్యాలయాల్లో హెల్ప్ లైన్ ఏర్పాటు
* జీహెచ్ఎంసీ పరిధిలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు
* కంటెయిన్‌మెంట్ జోన్లలో ఎలాంటి పరీక్షా కేంద్రాలు లేవు
* విద్యార్థులకు మధ్య 5 నుంచి 6 అడుగులు భౌతికదూరం ఉండేలా ఏర్పాట్లు

* వ్యాధి నిరోధకశక్తిని పెంచే మందులు సరఫరా చేయాలని ఆయుష్ విభాగాన్ని కోరాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని