పసిబిడ్డ కోసం అథ్లెట్‌లా పరిగెత్తాడు

సంక్షోభ సమయంలో ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ..మానవత్వం మిగిలే ఉందన్న కొన్ని ఉదాహరణలు ఊరట కలిగిస్తుంటాయి.

Published : 05 Jun 2020 02:18 IST

పాలు అందించి, చిన్నారి ఆకలి తీర్చిన రైల్వే పోలీసు

భోపాల్‌: వన్యప్రాణుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ రాక్షాసానందం పొందుతున్న ఘటనలు వెలుగుచూస్తున్న వేళ.. మానవత్వం ఇంకా మిగిలే ఉందన్న కొన్ని ఉదాహరణలు ఊరట కలిగిస్తుంటాయి. అలాంటి ఘటనే ఒకటి తాజాగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ రైల్వే స్టేషన్‌లో సీసీటీవీ కెమెరాల సాక్షిగా వెలుగులోకి వచ్చింది. కదులుతున్న రైల్లో ఉన్న ఓ పసికందుకు పాలు అందివ్వాలన్న తాపత్రయంతో సిబ్బంది ఒకరు పరిగెత్తిన తీరు ఇప్పుడు ప్రశంసలు అందుకుంటోంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు వెళ్తున్న ఓ మహిళ తన నాలుగు నెలల చిన్నారి పాల కోసం రైల్వే రక్షణ సిబ్బంది ఇందర్‌ యాదవ్ సాయం కోరారు. ఆ సమయంలో రైలు భోపాల్ స్టేషన్‌లో ఆగింది. కానీ ఆయన వాటిని తెచ్చేలోపే రైలు కదిలింది. కానీ ఆ పసికందుకు ఎలాగైనా పాలు అందించాలన్న తపనతో ఒకచేతిలో రైఫిల్‌ను, మరోచేతిలో పాల ప్యాకెట్‌ను పట్టుకొని యాదవ్ ఒక అథ్లెట్ మాదిరిగా పరిగెత్తారు. ఎట్టకేలకు వాటిని తల్లికి అందించగలిగారు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఇంటికి చేరుకున్న తరవాత ఆ తల్లి.. ఇందర్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఆయన సాయం చేయడానికి ముందు నా బిడ్డకు పాలు లేకపోవడంతో బిస్కట్లను నీళ్లలో ముంచి తినిపించాల్సి వచ్చింది. మా జీవితంలో ఆయనొక హీరో’ అని తన కృతజ్ఞతాభావాన్ని చాటుకున్నారు.

దీనిపై రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్ కూడా స్పందించారు. ‘చిన్నారికి పాలు అందించడానికి ఆయన రైలు వెంట పరిగెత్తి, అద్భుత పనితీరును ప్రదర్శించారు. నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించి, ఆయన్ను గౌరవిస్తున్నాం’ అని యాదవ్ సేవా భావాన్ని గుర్తించారు. నెట్టింట్లో కూడా ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని