Updated : 04 Jun 2020 21:37 IST

సాంకేతికత జీవితాల్లో మార్పు తెచ్చేలా ఉండాలి

హైదరాబాద్: ప్రస్తుత కరోనా ఆపత్కాలంలో ప్రజలకు, ప్రభుత్వాలకు సాంకేతికత ఉపయుక్తంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ రిజినల్ యాక్షన్ గ్రూప్ ఫర్ సౌత్ ఏషియా పేరుతో జరిగిన సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. కరోనా నియంత్రణలో ఎమర్జింగ్‌ టెక్నాలజీల పాత్ర అనే అంశంపై వర్చువల్ సమావేశం ద్వారా కేటీఆర్‌ ప్రసంగించారు. ఆయనతో పాటు పలు దేశాల మంత్రులు, వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ అధ్యక్షుడు, ఎండీ, పలు దేశాల నిపుణులు, కంపెనీల అధినేతలు ఈ సదస్సులో పాల్గొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చోట్ల టెక్నాలజీని ఉపయోగించుకుంటోందని.. కరోనా వలన ఎర్పడిన పరిమితులను అధికమించేందుకు నూతన సాంకేతిక పరిష్కారాలు ఎంతగానో దోహదం చేశాయని వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం సామాన్యుడి జీవితాల్లో మార్పు తీసుకొచ్చేలా ఉండాలని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని