సచివాలయ ఉద్యోగులకు ఆ యాప్‌ తప్పనిసరి

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగులు, సచివాలయ సందర్శకులకు ఆరోగ్య సేతు యాప్‌ను తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారి చరవాణిలో ఆరోగ్య సేతు యాప్‌ లేకుండా సచివాలయంలోకి అనుమతించేది....

Updated : 05 Jun 2020 21:32 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగులు, సచివాలయ సందర్శకులకు ఆరోగ్య సేతు యాప్‌ను తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారి చరవాణిలో ఆరోగ్య సేతు యాప్‌ లేకుండా సచివాలయంలోకి అనుమతించేది లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. యాప్‌లో ప్రమాద సూచిక వస్తే ఆ ఉద్యోగికి వర్క్‌ఫ్రం హోమ్‌ ఇవ్వాలని సూచించింది. సచివాలయ బ్లాకుల్లో శానిటైజేషన్‌ చేయాలని తెలిపింది. హైదరాబాద్‌ నుంచి ఏపీకి వెళ్లిన ఏపీ సచివాలయ ఉద్యోగులు కొందరికి కరోనా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే మిగతా ఉద్యోగులకు పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు