ఏపీ ప్రైవేట్‌ వైద్య కళాశాలలకు సర్క్యులర్‌ జారీ

పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌లో సీట్లు వచ్చిన వారిని కళాశాలల్లో చేర్చుకోని ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. విద్యార్థులను కళాశాలల్లో ఎందుకు....

Published : 05 Jun 2020 23:49 IST

విజయవాడ: పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌లో సీట్లు వచ్చిన వారిని కళాశాలల్లో చేర్చుకోని ప్రైవేట్ మెడికల్ కళాశాలలకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. విద్యార్థులను కళాశాలల్లో ఎందుకు చేర్చుకోవడంలేదో ఈనెల 8వ తేదీలోగా వివరణ ఇవ్వాలని వర్శిటీ అధికారులు సర్క్యులర్‌లో పేర్కొన్నారు. లేకుంటే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని ప్రైవేట్‌ కళాశాలలకు తెలిపారు.

ఈ ఏడాది జరిగిన పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌లో 14 మెడికల్ కళాశాలల్లో 618 మంది విద్యార్థులకు కన్వీనర్ కోటాలో వర్సిటీ సీట్లను కేటాయించింది. అయితే ప్రభుత్వం ఈ ఏడాది ఫీజులు తగ్గించిందనే కారణంతో ప్రైవేట్‌ కళాశాలల యాజమాన్యాలు పీజీ ప్రవేశాలను నిలిపివేశారు. ఈ నెల 4 వ తేదీతో కళాశాలల్లో చేరేందుకు గడువు ముగుస్తుందని విద్యార్థులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో 10వ తేదీ వరకు గడువును పొడిగిస్తూ వర్శిటీ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని