ఆరుగురికి కరోనా..దిల్లీ ఈడీ ఆఫీస్‌ మూసివేత

కరోనా వైరస్‌ దిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రధాన కార్యాలయానికి తాకింది. తాజాగా అందులో పనిచేసే ఆరుగురు అధికారులకు కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. కొవిడ్‌ బాధిత అధికారులతో సన్నిహితంగా ఉన్న పది మందికిపైగా వ్యక్తులను క్వారంటైన్‌ చేశారు.

Published : 06 Jun 2020 10:50 IST


దిల్లీ: దేశరాజధానిలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది కొవిడ్‌ బారిన పడుతుండటంతో వాటిని మూసివేస్తున్నారు. తాజాగా‌ దిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ప్రధాన కార్యాలయానికి వైరస్‌ సెగ తాకింది. అందులో పనిచేసే ఆరుగురు అధికారులకు కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో వారితో సన్నిహితంగా ఉన్న పది మందికిపైగా సిబ్బందిని క్వారంటైన్‌ చేశారు. శానిటైజేషన్‌ పనులు చేపట్టేందుకు ప్రధాన కార్యాలయాన్ని రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కార్యాలయాన్ని అధికారులు వారానికి రెండు రోజులు శానిటైజేషన్‌‌ చేస్తున్నారు. పరిమిత సంఖ్యలో మాత్రమే ఉద్యోగులు హాజరవుతున్నారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కరోనా కేసులు రావడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.

ఇదీ చదవండి..
24 గంటల్లో 9,887 కేసులు..294 మరణాలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని