‘పది’ పరీక్షలపై కొనసాగుతున్న ఉత్కంఠ

తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పరీక్షల నిర్వహణపై దాఖలైన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన విచారణకు ఎస్‌ఎస్‌సీ బోర్డు డైరెక్టర్‌ సత్యనారాయణ రెడ్డి

Updated : 06 Jun 2020 15:00 IST

హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. పరీక్షల నిర్వహణపై దాఖలైన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన విచారణకు ఎస్‌ఎస్‌సీ బోర్డు డైరెక్టర్‌ సత్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయని పిటిషనర్‌ తరఫు న్యాయవాది పవన్‌కుమార్‌ ఉన్నత న్యాయస్థానానికి తెలియజేశారు. కరోనా కేసులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పంజాబ్‌ తరహాలో పరీక్షలు లేకుండానే విద్యార్థులకు గ్రేడింగ్‌ ఇవ్వాలని పిటిషనర్‌ విజ్ఞప్తి చేశారు.

ఈ మేరకు వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం పరీక్షలు లేకుండా గ్రేడింగ్‌ ఇవ్వడానికి ఇబ్బంది ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. అయితే రాష్ట్రంలో వేర్వేరుగా పరీక్షలు నిర్వహించడం కష్టమని, ప్రశ్నా పత్రాలు మళ్లీ మళ్లీ తయారు చేయడం ఇబ్బందని అడ్వొకేట్‌ జనరల్‌ ప్రసాద్‌ కోర్టుకు తెలిపారు. సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గానే పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఏజీ చెప్పారు. విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా లేక సాంకేతిక అంశాలు ముఖ్యమా? అని కోర్టు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రభుత్వాన్ని సంప్రదించి చెబుతామని హైకోర్టుకు ఏజీ తెలిపారు. తరుపరి విచారణను ఈరోజు సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు