పిల్లికూతలు చాలు..డ్రగ్స్ వద్దు

ముంబయి వాసులను హెచ్చరిస్తూ, సలహాలు ఇస్తూ అక్కడి పోలీసులు ట్విటర్‌లో ఆకట్టుకొనే పోస్టులను పెడుతుంటారు.

Published : 07 Jun 2020 00:55 IST

ముంబయి: ముంబయి వాసులను హెచ్చరిస్తూ, సలహాలు ఇస్తూ అక్కడి పోలీసులు ట్విటర్‌లో ఆకట్టుకొనే పోస్టులను పెడుతుంటారు. తాజాగా డగ్స్‌ వాడకంపై పిల్లిబొమ్మతో వారు పెట్టిన పోస్టు ఆలోచింపజేస్తోంది. దాని ద్వారా వారు ఓ హెచ్చరిక పంపారు. ఇంతకీ విషయం ఏంటంటే..

ముంబయిలో ‘మ్యావ్ మ్యావ్’ పేరుతో ఒకరకానికి చెందిన డ్రగ్ అమ్మకాలు జరుగుతున్నాయి. దాని శాస్త్రీయ నామం మెఫిడ్రోన్‌. కొకైన్ చూపిన ప్రభావమే ఇది కూడా చూపిస్తుంది. దాంతో దీని వాడకాన్ని నిరోధించడానికి ముంబయి పోలీసులు ట్విటర్ వేదికగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా..‘‘మ్యావ్ మ్యావ్’ మాత్రమే అంగీకారయోగ్యమైంది, డ్రగ్‌ వద్దని చెప్పండి’ అని ట్వీట్ చేశారు. దాంతో పాటు ఒక పిల్లి బొమ్మను షేర్ చేశారు. కాగా,  2007 నుంచి ఈ డ్రగ్ వాడకం పెరిగింది. అంతర్జాలం ద్వారా దీని అమ్మకాలు ఎక్కువయ్యాయి. దాంతో ప్రభుత్వం దీనిపై నిషేధం విధించింది. ఇదిలా ఉండగా, జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినమైన అక్టోబరు 2ను నేషనల్ యాంటీ డ్రగ్ అడిక్షన్ డేగా నిర్వహిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని