టీఎస్‌లో ‘పది’ పరీక్షలు వాయిదా

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. హైకోర్టు తీర్పును అనుసరించి పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ మినహా మిగతా జిల్లాల్లో

Published : 07 Jun 2020 01:33 IST

హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. హైకోర్టు తీర్పును అనుసరించి పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ మినహా మిగతా జిల్లాల్లో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు అనుమతి ఇచ్చిన కొద్ది గంటల్లోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పదో తరగతి పరీక్షల నిర్వహణ విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై త్వరలో సీఎం కేసీఆర్‌తో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో మినహా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించవచ్చని ఇవాళ సుదీర్ఘ విచారణ తర్వాత హైకోర్టు తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వారం రోజులకు ఒకసారి పరీక్ష కేంద్రాల వద్దర పరిస్థితిని సమీక్షించాలని స్పష్టం చేసింది. పరీక్షలు జరుగుతున్న ప్రాంతాల్లో కొత్తగా కరోనా కేసులు నమోదు అయినట్లయితే అక్కడ కూడా వాయిదా వేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. వీటన్నింటి నేపథ్యంలో పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలు, ఇతర అంశాలపై విద్యాశాఖ సుదీర్ఘంగా చర్చించింది.

జీహెచ్‌ఎంసీ మినహా ఇతర జిల్లాల్లో పరీక్షలు నిర్వహించినప్పటికీ వాటి ఫలితాలు విడుదల చేయడం సాధ్యం కాదని విద్యా శాఖ పేర్కొంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరోసారి పరీక్షలు నిర్వహించాలంటే సాంకేతికంగా అనేక ఇబ్బందులు ఎదురవుతాయని.. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి నిర్వహించాలి లేదా రద్దు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఇంటర్‌, పాటిటెక్నిక్‌, ఐటీఐ ప్రవేశాల్లో గందరగోళం తలెత్తుతుందని విద్యా శాఖ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. పరీక్షలు లేకుండానే గ్రేడింగ్‌ ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. సోమవారం సీఎంతో జరిగే భేటీలో పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.

ఇదీ చదవండి..

జీహెచ్‌ఎంసీ మినహా ‘పది’ పరీక్షలకు ఓకే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని