రండి.. కరోనాను ‘డి’ కొడదాం!
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయ తాండవం కొనసాగిస్తూనే ఉంది. రోజుకు వందల్లో మరణాలు, వేలల్లో కరోనా కేసులు నమోదతున్నాయి. కరోనాకు విరుగుడైన వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో కూడా కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
ఇంటర్నెట్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. రోజూ కొత్తగా వందల్లో మరణాలు, వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. కరోనాకు విరుగుడైన వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి తరుణంలో కరోనాతో పోరాడాలంటే వ్యాధి నిరోధక శక్తిదే కీలకపాత్ర అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందులోనూ విటమిన్ ‘సి’ తో పాటు విటమిన్ ‘డి’ కరోనాను కట్టడి చేయడంలో ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో విటమిన్ ‘డి’ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి విటమిన్ ‘డి’ రోగ నిరోధక శక్తిని పెంపొందిచడంలో ఎలా ఉపయోగపడుతుంది..? ఏయే పదార్థాల్లో లభిస్తుంది..? తదితర విషయాలపై ఓ లుక్కేయండి.
ఈ లక్షణాలుంటే జాగ్రత్త
శరీరానికి పోషకాలు, ఖనిజ లవణాలు, కార్బొహైడ్రేట్స్‌తో పాటు విటమిన్‌లు కూడా చాలా అవసరం. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో విటమిన్లది కీలకపాత్ర. విటమిన్ ‘డి’ మీలో లోపిస్తే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా తరచుగా జట్టు రాలిపోవడం, శరీరం బలహీనమవ్వడం, అలసట, ఒంటి నొప్పులు, కీళ్ల నొప్పులు, చురుకుగా లేకపోవడం వంటి లక్షణాలు ఉంటే విటమిన్ ‘డి’ లోపంతో మీరు బాధపడుతున్నట్టే.
వీటిపై ప్రభావం..
మనిషి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే విటమిన్ ‘డి’ లోపిస్తే అది శరీరంలోని కొన్ని భాగాలపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఎముకలు, కండరాల పటుత్వం క్షీణిస్తుంది. మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. గుండె సంబంధిత వ్యాధులకు విటమిన్ ‘డి’ లోపం కూడా ఒక కారణం. ఎముకలు దృఢంగా తయారవ్వాలంటే శరీరానికి సరిపడా కాల్షియం ఉండాలి. కాల్షియం సరైనంత మోతాదులో లేకపోతే ఎముకల బలహీనమవుతాయి. మరి ఇంతటి ప్రాధాన్యం ఉన్న కాల్షియం ఉత్పత్తికి విటమిన్ ‘డి’ సహకరిస్తుంది. సూర్యకాంతి శరీరంపై పడ్డప్పుడు విటమిన్ ‘డి’ శరీరంలో కాల్షియం తయారవ్వడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఒకవేళ ఈ విటమిన్ ‘డి’ లోపిస్తే ఎముకలు క్రమంగా వంకరగా తయారై చివరికి వ్యక్తి ‘రికెట్స్’ వ్యాధిని బారిన పడతాడు.
ఉషాకిరణాలు.. వ్యాధి నిరోధక బాణాలు
విటమిన్ ‘డి’ శరీరంలోని కొవ్వు నుంచి తయారవుతుంది. సుప్రభాత వేళ సూర్యుడు నుంచి వచ్చే కిరణాలు విటమిన్ ‘డి’ ఉత్పత్తికి ప్రధాన కారణం. అందుకే ఉషాకిరణాలు.. వ్యాధి నిరోధక బాణాలుగా పనిచేసే ఆయుధాలని చెప్పుకోవచ్చు. బిజీబిజీ లైఫ్‌స్టైల్‌లో చాలా మంది ఉదయపు సూర్యకాంతికి అంతగా ప్రాధాన్యం ఇవ్వట్లేదు. కరోనాను ఎదుర్కొనేందుకు రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం చాలా అవసరం. కాబట్టి ఇకనైనా రోజు ఉదయం సూర్యకాంతి మీ శరీరంపై పడేలా చూసుకోండి. దీంతో పాటు విటమిన్ ‘డి’ పుష్కలంగా ఉండే పాలు, చేపలు, కాడ్ లివర్ ఆయిల్, గుడ్లు, పుట్టగొడుగులు, ఓట్స్, రొయ్యలు, వెన్న, జున్ను, కమలాలు వంటి ఆహార పదార్థాలను మీ డైట్‌లో తీసుకోండి. కరోనా మహమ్మారిని విటమిన్ ‘డి’ అనే ఆయుధంతో పోరాడి విజయులు కండి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Navjot Singh: సిద్ధూ భార్యకు క్యాన్సర్.. ‘ఇక వేచి ఉండలేనంటూ’ ట్వీట్
-
Politics News
Panchumarthi Anuradha: అప్పుడు 26ఏళ్లకే మేయర్.. ఇప్పుడు తెదేపా ఎమ్మెల్సీ!
-
Movies News
Srikanth: విడాకుల రూమర్స్.. భార్యతో కలిసి వెళ్లాల్సి వస్తోంది: శ్రీకాంత్
-
Politics News
MLC Elections: వైకాపా పతనం ప్రారంభమైంది: తెదేపా శ్రేణులు
-
Politics News
KTR: రేవంత్ రెడ్డి, బండి సంజయ్కు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు
-
India News
CBIకి కొత్త చట్టం అవసరం.. పార్లమెంటరీ కమిటీ సూచన