ఆస్పత్రి బిల్లు కట్టలేదని మంచానికి కట్టేశారు!

ఆస్పత్రి బిల్లు కట్టలేదన్న కారణంతో ఓ పెద్దాయనను మంచానికి తాళ్లతో కట్టేశారు ఆస్పత్రి సిబ్బంది. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్‌లో..........

Published : 07 Jun 2020 17:57 IST

భోపాల్‌ (మధ్యప్రదేశ్‌): ఆస్పత్రి బిల్లు కట్టలేదన్న కారణంతో ఓ పెద్దాయనను మంచానికి తాళ్లతో కట్టేశారు ఆస్పత్రి సిబ్బంది. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ విచారణకు ఆదేశించారు.

ఇక్కడి షాజాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో ఇటీవలే అనారోగ్యంతో ఓ పెద్దాయన చేరారు. తొలుత చికిత్స కోసం డిపాజిట్‌గా రూ.5వేలు కట్టామని రోగి కుమార్తె తెలిపారు. అయితే, అనుకున్నదాని కంటే ఆస్పత్రిలో ఎక్కువ రోజులు ఉండాల్సి రావడంతో బిల్లు పెరిగిందని చెప్పారు. ఆ స్థోమతకు తమకు లేదని వాపోయారు. రూ.11 వేలు బిల్లు చెల్లించలేదన్న కారణంతో తన తండ్రిని ఇలా మంచానికి కట్టేశారని కుమార్తె తెలిపారు.

అయితే, ఆస్పత్రి వర్గాల వాదన మరోలా ఉంది. అతడికి మూర్చ వ్యాధి ఉందని, అందుకే మంచానికి కట్టేశామని చెప్పుకొచ్చారు. అంతేకాదు మానవతా దృక్పథంతో అతడి ఆస్పత్రి ఫీజును కూడా పూర్తిగా రద్దు చేశామని తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ స్పందించారు. షాజాపూర్‌ ఘటన తన దృష్టికి వచ్చిందని, రోగి పట్ల క్రూరంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీనిపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని