గ్యాస్‌ లీకేజీపై హై పవర్‌ కమిటీ భేటీ

ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై విశాఖలో రెండో రోజు హైపవర్‌ కమిటీ భేటీ కొనసాగింది. ఇవాళ హైపవర్‌ కమిటీ ముందు ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ ప్రతినిధులు హాజరయ్యారు. గ్యాస్‌ లీకేజీ ప్రమాదం..

Updated : 07 Jun 2020 21:57 IST

విశాఖ: ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై విశాఖలో రెండో రోజు హై పవర్‌ కమిటీ భేటీ కొనసాగింది. ఇవాళ  కమిటీ ముందు ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ ప్రతినిధులు హాజరయ్యారు. గ్యాస్‌ లీకేజీ ప్రమాదం జరిగిన తీరును పరిశ్రమ ప్రతినిధులు కమిటీకి వివరించారు. పరిశ్రమ భద్రతా ప్రమాణాలను సైతం కమిటీకి ప్రతినిధులు వివరించారు.

అంతకుముందు జీవీఎంసీ సమావేశ మందిరంలో గ్యాస్‌ ప్రభావిత ప్రాంతాల ప్రజలు, వివిధ పార్టీల నేతలతో హై పవర్‌ కమిటీ వేర్వేరుగా భేటీ అయింది. ఎల్జీ దుర్ఘటన ప్రభావిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన 21 మంది గ్రామస్థులు సమావేశంలో పాల్గొన్నారు. తమ సమస్యలు ఎవరూ పట్టించుకోలేదని, కమిటీ వద్ద అయినా గోడు వెళ్లబోసుకోవడానికి వచ్చామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్‌ దుర్ఘటనలో మృతి చెందిన కనకరాజు భార్య సమావేశంలో పాల్గొనేందుకు రాగా.. అనుమతిలేదని పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆమె జీవీఎంసీ గేటు వద్దే సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది హుటాహుటీన బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.

 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని