ఇది బంగారు హోటల్‌

దుబాయిలోని బుర్జ్‌ అల్‌-అరబ్‌ హోటల్‌లోని ఎలివేటర్‌, లాబీని బంగారం పూతతో ఏర్పాటు చేశారు. అక్కడికి పర్యటకు వెళ్లిన వాళ్లు దాన్ని చూడటానికి ఆసక్తి కనబరుస్తుంటారు. అలాగే యూఏఈలోని ఎమిరేట్స్‌ ప్యాలెస్‌లో  సీలింగ్‌, గోడలు.. లాస్‌ వెగాస్‌లోని  ట్రంప్‌ ఇంటర్నేషనల్‌ హోటల్‌లో

Updated : 11 Jul 2020 12:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బంగారంతో చేసిన ఆభరణాలు, బంగారం పూత ఉన్న మొబైల్‌ ఫోన్లు... ఇలా చాలానే చూసే ఉంటారు. అంతెందుకు దుబాయిలోని బుర్జ్‌ అల్‌-అరబ్‌ హోటల్‌లోని ఎలివేటర్‌, లాబీని బంగారం పూతతో ఏర్పాటు చేశారు. యూఏఈలోని ఎమిరేట్స్‌ ప్యాలెస్‌లో సీలింగ్‌, గోడలకు బంగారం పూత వేశారనీ విన్నాం. లాస్‌ వెగాస్‌లోని ట్రంప్‌ ఇంటర్నేషనల్‌ హోటల్‌లో కిటికీలు కూడా బంగారంపూతతో నిర్మించారని తెలుసుకున్నాం. ఇప్పుడు వాటన్నింటినీ తలదన్నెలా వియత్నాంలో ప్రయత్నం జరుగుతోంది. వాటన్నింటి కన్నా గొప్ప అనిపించుకోవాలని వియత్నాంలోని ఓ హోటల్‌ ఓ అడుగు ముందుకేసి హోటల్‌ మొత్తాన్ని బంగారంతో తాపడం చేయిస్తోంది. అవును నిజం. చాలా రోజులుగా జరుగుతున్న పనులు చివరి దశకొచ్చాయి. 

డోల్స్‌ హనొయ్‌ గోల్డెన్‌ లేక్‌ హోటల్‌.. 2009లో మొదలైన దీని నిర్మాణం ఇంకా కొనసాగుతోంది. ఈ ఏడాది చివర్లో నిర్మాణం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని యాజమాన్యం చెబుతోంది. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ ఐదు నక్షత్రాల హోటల్‌ మొత్తం బంగారుమయమే.

హోటల్‌ బయట, లోపల గోడలకు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో తాపడం చేయిస్తున్నారు. హోటల్‌ లోపల లాబీ, ఎలివేటర్లు, ఫర్నీచర్‌, సింక్‌, బాత్‌టబ్‌ ఇలా ప్రతిదీ బంగారంతోనే ఏర్పాటు చేశారు. ఇందులో ఒక రోజు బస చేయడానికి సుమారు రూ.20 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది మన దేశంలోని ఖరీదైన హోటల్స్‌లో కన్నా తక్కువే.

అంతేకాదు.. 25 అంతస్తుల ఈ హోటల్‌లో కొన్ని ఫ్లాట్‌లను కొనుగోలు చేయొచ్చు. చదరపు మీటర్‌ ధర రూ. 4.9 లక్షలుగా నిర్ణయించారు. అయితే కొనుగోలు చేసిన వారు మాత్రం అందులో ఉండటానికి వీల్లేదు. దాన్ని రెంటల్‌ ఏజెన్సీల ద్వారా అద్దెకివ్వాలి. ఈ హోటల్‌ను హోవా బిన్‌ గ్రూప్‌ నిర్మిస్తోంది. హోటల్‌ మొత్తాన్ని బంగారంతో తాపడం చేయించడం ప్రపంచంలో ఇదే తొలిసారని హోవా బిన్‌ గ్రూప్‌ అంటోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు