చిరుతను చంపి.. ముక్కలుగా చేసి..
మూగ జీవాలపై మానవుల కర్కశత్వం రోజురోజుకు పెరుగుతునే ఉంది. కేరళలో ఆకలితో ఉన్న ఏనుగుకు ...
గువాహటి (అసోం) : ఓ చిరుతను చంపి శరీర భాగాలను ముక్కలుగా చేసిన ఘటన అసోంలో వెలుగుచూసింది. తమ మేకలు, కుక్కలు వంటి పెంపుడు జంతువులపై చిరుత దాడి చేస్తుండటంతో.. గువాహటిలోని రిజర్వు ఫారెస్ట్ ప్రాంతం ఫటాసిల్లో గ్రామస్థులు ఓ ఉచ్చును ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 7.30 గంటలకు చిరుత దానిలో చిక్కుకుంది. అది గమనించిన అటవీశాఖ అధికారి జితేందర్కుమార్ గువహటి జూ అధికారులకు సమాచారమిచ్చారు. వారు రాకముందే అక్కడికి చేరుకున్న గ్రామస్థులు చిరుతపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అది తప్పించుకుని అడవిలోకి పారిపోయింది. చిరుతను చంపవద్దని కుమార్ గ్రామస్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినలేదు. ఆయన, అక్కడ నుంచి వెళ్లిన గంట సేపట్లోనే గ్రామస్థులు చిరుతను పట్టుకుని చంపేశారు. దాని శరీరం నుంచి దంతాలు, చర్మం, గోళ్లను తీసుకొన్నారని సిబ్బందిలో ఒకరు సమాచారమివ్వడంతో కుమార్ అక్కడి చేరుకున్నారు. ఈ దాడికి పాల్పడిన ఆరుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు చెప్పారు. లాక్డౌన్ సమయంలో ఒక్క ఏప్రిల్ నెలలోనే అసోంలోని గోలాఘాట్ , జోర్హాట్ జిల్లాల్లో నాలుగు చిరుతలు చనిపోగా... గువహటిలో మరో చిరుత హతం కావటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు