16 నుంచి ఏపీ బడ్జెట్‌ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 16వ తేదీ నుంచి నిర్వహించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. దీనికి సంబంధించిన దస్త్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ ఆమోదానికి పంపారు. ఆయన ఆమోదం

Published : 08 Jun 2020 15:08 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాలు ఈ నెల 16వ తేదీ నుంచి నిర్వహించేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. దీనికి సంబంధించిన దస్త్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ ఆమోదానికి పంపారు. ఆయన ఆమోదం తర్వాత ఈ సాయంత్రంలోగా అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. 

ఈ నెల 19న రాజ్యసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో 16 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు గవర్నర్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 18వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బీఏసీ సమావేశం తర్వాత అసెంబ్లీ ఎన్నిరోజులు జరపాలన్న దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 30వ తేదీతో ఓటాన్ అకౌంట్ కోసం తెచ్చిన ఆర్డినెన్స్ గడువు ముగియనుంది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని