ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

రాగల 48 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తదుపరి 24 గంటల్లో బలపడనుందని....

Published : 08 Jun 2020 18:18 IST

అమరావతి: రాగల 48 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తదుపరి 24 గంటల్లో బలపడనుందని విపత్తుల శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 4 రోజులు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ సూచించింది. మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. ఉత్తరాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాల యంత్రాంగాన్ని, అధికారులను విపత్తుల శాఖ అప్రమత్తం చేసింది. జూన్‌ 9న కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కోస్తాంధ్ర, రాయలసీమలో పిడుగులుపడే అవకాశం ఉందని తెలిపింది. జూన్‌ 10, 11, 12 తేదీల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని