ఏపీలో ‘పది’ పరీక్షలు యథాతథం: మంత్రి

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టంచేశారు

Updated : 10 Jun 2020 14:23 IST

ఒంగోలు: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టంచేశారు. జులై 10 నుంచి యథావిధిగా నిర్వహించనున్నట్టు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. 

మార్చి నెలాఖరులో జరగాల్సిన పదో తరగతి పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో రోజురోజుకీ వైరస్‌ వ్యాప్తి పెరిగిపోతుండటంతో పరీక్షలు ఎప్పుడు జరుగుతాయోనని విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు, ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు పది పరీక్షలను రద్దు చేయడంతో ఏపీలోనూ పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలంటూ విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పది పరీక్షలపై మంత్రి స్పందించారు.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని