గంటల తరబడి ఎండ ఉన్నా... వైరస్‌ విజృంభణకు ఆస్కారం!

వాతావరణంలో అధిక వేడి, తేమ ఉంటే కరోనా వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉంటుందని నిపుణులు చెప్పడం విన్నాం. అయితే... గంటల తరబడి ఎండ ఉన్నా వైరస్‌

Updated : 11 Jun 2020 08:44 IST

టొరంటో: వాతావరణంలో అధిక వేడి, తేమ ఉంటే కరోనా వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉంటుందని నిపుణులు చెప్పడం విన్నాం. అయితే... గంటల తరబడి ఎండ ఉన్నా వైరస్‌ వ్యాప్తి పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది! ఎక్కువసేపు ఎండ కాయడం ప్రజల ప్రవర్తనలో మార్పులకు కారణమవుతోందని, ఫలితంగా ఎక్కువమంది వైరస్‌ బారిన పడేందుకు ఆస్కారం ఏర్పడుతోందని కెనడాకు చెందిన మెక్‌మాస్టర్‌ యూనివర్సిటీ పరిశోధకులు పేర్కొన్నారు. వివిధ వాతావరణ పరిస్థితుల్లో కరోనా కేసుల తీరు ఎలా ఉందన్న విషయమై వీరు అధ్యయనం సాగించారు. సుమారు 3 లక్షల కొవిడ్‌-19 కేసులతో అల్లాడుతున్న స్పెయిన్‌లో వారు 30 రోజుల పాటు విశ్లేషణ చేపట్టారు. ‘‘వాతావరణంలో వేడి, తేమ ఒక్క శాతం పెరిగితే, కొవిడ్‌-19 వ్యాప్తి 3% తగ్గుతున్నట్టు గుర్తించాం. అధిక ఉష్ణోగ్రతలు వైరస్‌ సామర్థ్యాన్ని అడ్డుకోవడమే ఇందుక్కారణం. అలాగని గంటల తరబడి ఎండ ఉన్న రోజుల్లోనూ వైరస్‌ వ్యాప్తి అధికమవుతోంది. ఎక్కువసేపు ఎండ ఉన్న రోజుల్లో ప్రజలు లాక్‌డౌన్‌ నిబంధనలను అతిక్రమించి బయటకు వస్తున్నారు. ఫలితంగా వైరస్‌ సంక్రమణం ఎక్కువవుతోంది’’ అని పరిశోధనకర్త ఆంటానియో పయీజ్‌ వివరించారు. జియోగ్రాఫికల్‌ అనాలసిస్‌ పత్రిక ఈ వివరాలను ప్రచురించింది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts