జాబ్ బోర్ కొట్టిందని దావా వేశాడు.. గెలిచాడు
ఫ్రెడరిక్ డెస్నార్డ్.. ఫ్రాన్స్‌లో పర్‌ఫ్యూమ్స్ తయారీ చేసే సంస్థ ఇంటర్‌పర్‌ఫ్యూమ్ మేనేజర్‌గా పనిచేసేవాడు. ఆ ఉద్యోగం తనకు బోర్ కొట్టడంతో 2015లో రాజీనామా చేసి బయటకు వచ్చేశాడు. అయితే అందరిలా మరో ఉద్యోగం కోసం వెతకడం మానేసి మరుసటి ఏడాది ఏకంగా తను ఉద్యోగం చేసిన సంస్థపైనే
ఇంటర్నెట్ డెస్క్: ఎంతో కష్టపడి చదివి ఉద్యోగం సంపాదిస్తాం.. కొన్ని సార్లు చేసే ఉద్యోగం సంతృప్తి ఇవ్వకపోయినా.. చేసే పని నచ్చకపోయినా ఉద్యోగం మానేసి.. నచ్చిన ఉద్యోగం కోసం ఆన్వేషిస్తాం. కానీ, ఫ్రాన్స్‌లో ఓ వ్యక్తి.. తను చేసే ఉద్యోగం బోర్ కొడుతోందని పనిచేసే కంపెనీపైనే దావా వేశాడు. కొన్నేళ్ల న్యాయపోరాటం తర్వాత తాజాగా కేసు గెలిచి నష్ట పరిహారం పొందాడు. వివరాల్లోకి వెళ్తే..
ఫ్రెడరిక్ డెస్నార్డ్.. ఫ్రాన్స్‌లో పర్‌ఫ్యూమ్స్ తయారీ చేసే సంస్థ ఇంటర్‌పర్‌ఫ్యూమ్‌లో మేనేజర్‌గా పనిచేసేవాడు. ఆ ఉద్యోగం తనకు బోర్ కొట్టడంతో 2015లో రాజీనామా చేసి బయటకు వచ్చేశాడు. అయితే అందరిలా మరో ఉద్యోగం కోసం వెతకడం మానేసి మరుసటి ఏడాది ఏకంగా తను ఉద్యోగం చేసిన సంస్థపైనే కోర్టులో దావా వేశాడు. 2016లో ఫ్రెడరిక్ వేసిన దావా కేసు అంతర్జాతీయంగా సంచలనమైంది. ఇంటర్‌పర్‌ఫ్యూమ్ సంస్థలో తన ఉద్యోగం బోరింగ్‌గా ఉందని.. దాని వల్ల తాను మానసిక ఒత్తిడికి గురయ్యాయని ఫ్రెడరిక్ కోర్టుకు చెప్పాడు. తన తీరును గ్రహించిన సంస్థలోని ఉన్నతాధికారులు తనకు సుదీర్ఘ సెలవులు ఇచ్చారని, ఆ తర్వాత ఆఫీసుకు ఎక్కువ రోజులు రాకపోవడాన్ని సాకుగా చూపి తనతో రాజీనామా చేయించారని వాదనలు వినిపించాడు.
పారిస్ కోర్టులో జరిగిన వాదనల్లో ఫ్రెడరిక్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సంస్థలో సరైన ప్రోత్సాహం లేకపోవడంతోనే తన క్లయింట్ బోర్‌గా ఫీలయ్యి.. మానసిక ఒత్తిడికి గురయ్యాడని కోర్టుకు తెలిపారు. నష్టపరిహారంగా 4లక్షల డాలర్లు (సుమారు రూ. 3కోట్లు) ఇప్పించాలని కోరాడు. ఇలా నాలుగేళ్లపాటు కోర్టులో కేసు నడిచింది. తాజాగా ఈ కేసులో ఫ్రెడరిక్ గెలిచాడు. అయితే అతడు కోరిన విధంగా కోర్టు 4లక్షల డాలర్లు ఇప్పించలేదు గానీ.. 45వేల డాలర్లు (సుమారు రూ. 34 లక్షలు) పరిహారంగా ఇవ్వాలని ఇంటర్‌పర్‌ఫ్యూమ్ సంస్థను ఆదేశించింది. నిజానికి ఫ్రెంచ్ న్యాయ వ్యవస్థలో బోరింగ్ ఉద్యోగంపై వేసిన దావాపై విచారణకు సరైన విధానం లేదు. అయితే బోర్ కొట్టడంపై కాకుండా ఉద్యోగిని వేధించారన్న కోణంలో కోర్టు విచారణ జరిపి ఫ్రెడరిక్‌కు అనుకూలంగా తీర్పు వెల్లడించింది.
దీనిపై ఇంటర్‌పర్‌ఫ్యూమ్ సంస్థ స్పందిస్తూ.. ‘‘నాలుగేళ్లపాటు ఫ్రెడరిక్ మా సంస్థలో పనిచేశాడు. కానీ ఎప్పుడూ ఉద్యోగం బోర్ కొడుతోందని కానీ.. సరైన ప్రోత్సాహం లేదని కాని మాకు చెప్పలేదు. అనవసరంగా దావా వేశాడు’’అని తెలిపింది. అక్కడి న్యాయవాదులు ఈ తీర్పును చూసి ఆశ్చర్యపోయారు. ఫ్రాన్స్‌లో ఇలాంటి తీర్పు రావడం ఇదే తొలిసారని అంటున్నారు. భవిష్యత్తులో కంపెనీ తమకు పని చెప్పట్లేదని, ఉద్యోగంలో బోర్ కొడుతుందని కంపెనీలపైనే దావా వేసే ఉద్యోగుల సంఖ్య పెరగొచ్చని అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
AP Assembly: రెండోరోజూ స్పీకర్ పోడియం వద్ద తెదేపా ఎమ్మెల్యేల నిరసన
-
Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
-
TDP: అసెంబ్లీకి రెండో రోజూ పాదయాత్రగా వెళ్లిన తెదేపా ఎమ్మెల్యేలు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Tirumala Brahmotsavam: మోహినీ అవతారంలో శ్రీమలయప్పస్వామి
-
TREI - RB: ‘గురుకుల’ అభ్యర్థులకు నియామక బోర్డు కీలక సూచన