నిరసనగా నూరు సమాధులు...

కరోనా కట్టడిలో విఫలమైన తమ ప్రభుత్వ వైఖరిపై బ్రెజిల్‌ ప్రజలు తమ నిరసనను విభిన్నంగా తెలియచేశారు.

Published : 12 Jun 2020 23:30 IST

రియోడిజనిరో: దక్షిణ అమెరికాలోనే అతిపెద్ద దేశమైన బ్రెజిల్‌లో కరోనా వైరస్‌ కేసులు అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్నాయి. 7,70,000 కొవిడ్‌-19 కేసుల నమోదుతో ఆ దేశం అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉంది. కొవిడ్‌-19 సోకటం వల్ల ఇప్పటికే అక్కడ సుమారు 40,000 మంది మృతిచెందారు. కరోనా కట్టడిలో విఫలమైన ప్రభుత్వ వైఖరిపై బ్రెజిల్‌ ప్రజలు తమ నిరసనను విభిన్నంగా తెలియచేశారు. కరోనా మరణాలకు సంతాప సూచనగా ఆ దేశ రాజధాని రియోడిజనిరో సముద్ర తీరంలో ఒక్క రాత్రిలో వంద సమాధులు తవ్వారు. ఓ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మృతుల బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు. కాగా,  ఆ దేశాధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో పరిస్థితిని తక్కువ అంచనా వేయటం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని కొందరు విమర్శిస్తున్నారు. క్వారంటైన్‌ నిబంధనలను ఎత్తివేసి... మాస్కులు, సామాజిక దూరం నిబంధనలను పాటించే విషయమై సరైన మార్గదర్శకాలు జారీచేయకపోవటంతో వేలాది మరణాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల నిరసన తెలిపేందుకు ఎంచుకున్న విధానం చర్చనీయాంశమయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని