‘నిలకడగానే అచ్చెన్న ఆరోగ్య పరిస్థితి’

ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల కేసులో అరెస్టయిన టీడీఎల్పీ ఉపనేత, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ సుధాకర్‌

Updated : 13 Jun 2020 12:34 IST

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ సుధాకర్‌

గుంటూరు: ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్ల కేసులో అరెస్టయిన టీడీఎల్పీ ఉపనేత, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ సుధాకర్‌ స్పందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. రెండు లేదా మూడు రోజుల్లో గాయం నయమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ‘‘ఎక్కువసేపు ప్రయాణం వల్ల గాయం కాస్త పెరిగింది. ఇన్‌ఫెక్షన్‌ పెద్దదైతే మరోసారి ఆపరేషన్‌ చేయాల్సి రావొచ్చు. అయితే, 90శాతం మేరకు మళ్లీ ఆపరేషన్‌ అవసరం లేదు. అయితే, ఇప్పుడే చెప్పడం కుదరదు. నొప్పి తగ్గడానికి రెండు, మూడు రోజులు పడుతుంది. పూర్తిగా కోలుకోడానికి కొన్ని రోజులు పట్టొచ్చు’’ అని సుధాకర్‌ వివరించారు. 

ఈఎస్‌ఐ కేసులో విజయవాడ అనిశా కోర్టు అచ్చెన్నాయుడికి 14 రోజులపాటు రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. అయితే ఆయన అనారోగ్యం దృష్ట్యా ఆసుపత్రిలో చికిత్స అందించాలని ఆదేశించారు. ఈ మేరకు గుంటూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

ఇదీ చదవండి..
అచ్చెన్నకు రక్తస్రావం

అచ్చెన్నాయుడుకి 14 రోజుల రిమాండ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని