ముద్దుతో కరోనా పోతుందని.. సోకేలా చేశాడు

ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌కు సరైన చికిత్స లేదు. కరోనాకు మందు, వ్యాక్సిన్‌ కనుక్కోవడం కోసం...

Updated : 13 Jun 2020 15:48 IST

కరోనాతో భూతవైద్యుడు మృతి
27 మందికి కరోనా పాజిటివ్‌

రత్లాం(మధ్యప్రదేశ్‌) : ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌కు సరైన చికిత్స లేదు. కరోనాకు మందు, వ్యాక్సిన్‌ కనుక్కోవడం కోసం అనేక దేశాలు కృషి చేస్తున్నాయి. ఓవైపు వైద్యరంగపరంగా మందు కోసం ప్రయోగాలు జరుగుతుంటే మరోవైపు కరోనా నయం కావాలని మూఢనమ్మకాలతో ఏవేవో చేస్తున్నారు. మొన్నటికి మొన్న కరోనా పోవాలని ఓ వృద్ధుడు నరబలి ఇచ్చాడు. కొందరు చెట్లకు పూజలు చేస్తున్నారు. తాజాగా ఓ తాంత్రికుడు కరోనా నయం చేస్తానని చెప్పి.. చివరకు ఆ కరోనా కారణంగానే మృత్యువాతపడ్డాడు. అతడి వల్ల అమాయక ప్రజలు కరోనా బారిన పడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

మధ్యప్రదేశ్‌లోని రత్లాంకు చెందిన ఓ వ్యక్తి భూతవైద్యంతో  సమస్యలు పరిష్కారమవుతాయంటూ  తన వద్దకు వచ్చే వారి చేతులను ముద్దు పెట్టుకునేవాడు. అంతేకాదు తన ముద్దు  కరోనా రోగులపై పనిచేస్తుందని చెప్పి వారిని  నమ్మించాడు. జూన్‌ 3న ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ మరుసటి రోజే అతను మరణించాడు. దీంతో ఆ వ్యక్తి నిర్వహించిన తాంత్రిక పూజల్లో పాల్గొన్న 29 మందిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. వారి నుంచి రక్తనమూనాలను సేకరించి పరీక్షలకు పంపించగా.. ఆ భూతవైద్యుని కుటుంబంలోని ఏడుగురు సహా 20 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని