చింతమనేనికి రిమాండ్‌

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకుండా పోలీసు విధులకు ఆటంకం

Updated : 14 Jun 2020 09:44 IST

ఏలూరు నేరవార్తలు: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించకుండా పోలీసు విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై ప్రభాకర్‌ను ఏలూరు గ్రామీణ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 12న అచ్చెన్నాయుడిని అరెస్టు చేసి విజయవాడకు తీసుకెళ్తుండగా.. నిరసనగా చింతమనేని ప్రభాకర్‌ కార్యకర్తలతో కలసి జాతీయ రహదారి కలపర్రు టోలుగేటు వద్దకు వెళ్లారు. పోలీసులు చింతమనేనిని, మరో 8మంది అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. రాత్రంతా పోలీసుస్టేషన్‌లో ఉంచి, కేసులు నమోదు చేశారు. శనివారం అమీనాపేటలోని న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్లి హాజరుపరిచారు. చింతమనేనికి, అనుచరులు 8 మందికి రిమాండ్‌ విధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని