ఏపీలో పది పరీక్షలు రద్దు చేయాలి: అనగాని

కేబినెట్‌ మీటింగ్‌ సరిగా నిర్వహించలేని ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు ఎలా నిర్వహిస్తుందని రేపల్లె తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ప్రశ్నించారు....

Updated : 14 Jun 2020 15:20 IST

అమరావతి: కేబినెట్‌ మీటింగ్‌ సరిగా నిర్వహించలేని ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు ఎలా నిర్వహిస్తుందని రేపల్లె తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ప్రశ్నించారు. కరోనా నివారణలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. పదో తరగతి పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 

 కరోనా వైరస్‌కు భయపడి ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి, మంత్రులు తమ నియోజకవర్గం దాటి బయటకు రావడం లేదని... ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఎలా వస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ఏపీలో కూడా  పదో తరగతిపరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పాస్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రోజు రోజుకీ కరోనా కేసులు వందల సంఖ్యలో పెరుగుతుంటే.. పదో తరగతి  పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడతారా? అని ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని