జీజీహెచ్‌లో కోలుకుంటున్న అచ్చెన్నాయుడు

టీడీఎల్పీ ఉపనేత, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు శస్త్రచికిత్స గాయం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆయనను...

Published : 14 Jun 2020 13:53 IST

గుంటూరు: టీడీఎల్పీ ఉపనేత, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు శస్త్రచికిత్స గాయం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆయనను ఆసుపత్రిలోని రెండో అతస్తు గదికి తరలించారు. జ్యుడీషియ్‌ల్‌ కస్టడీలో ఉన్నందున పోలీసులు ఎవరినీ అనుమతించడంలేదు.
ఈఎస్‌ఐ కుంభకోణం ఆరోపణలతో శుక్రవారం ఉదయం అరెస్టయిన అచ్చెన్నాయుడిని దాదాపు 24 గంటల తర్వాత (శనివారం ఉదయం) గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించిన విషయం తెలిసిందే. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆయనను ఆసుపత్రిలో చేర్చుకుని జనరల్‌ సర్జరీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని