ఎక్కువ పనులు గుర్తించాలి: సోమేశ్‌కుమార్‌

ఉపాధి హామీ పనుల కింద నీటిపారుదల కాల్వలు, ఫీడర్‌ ఛానళ్ల నిర్మాణం, పూడికతీత పనులు ముమ్మరంగా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకంతో

Updated : 14 Jun 2020 18:17 IST

హైదరాబాద్‌: ఉపాధి హామీ పనుల కింద నీటిపారుదల కాల్వలు, ఫీడర్‌ ఛానళ్ల నిర్మాణం, పూడికతీత పనులు ముమ్మరంగా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌ అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకంతో అనుసంధానించగలిగే పనులపై అధికారులతో సీఎస్‌ సమీక్షించారు. నీటిపారుదల, పంచాయతీరాజ్‌ శాఖ పనులు అనుసంధానించే అంశంపై ప్రధానంగా చర్చించారు. ఉపాధి హామీని వేగవంతం చేయడంతో పాటు కూలీలకు విధిగా పని కల్పించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నందున వచ్చే నెల రోజులపాటు కూలీలకు పనులు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు సకాలంలో డబ్బు చేతికి అందితే కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు. నీటిపారుదల రంగానికి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని.. అందుకు అనుగుణంగా ఎక్కడ ఎలాంటి జాప్యం లేకుండా పనులు నిర్వహించాలని అధికారులకు సీఎస్‌ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని భారీ, మధ్యతరహా ప్రాజెక్టులతో పాటు చిన్ననీటి వనరులు, చెక్‌డ్యాంల కింద పూడికతీత పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సూచించారు. రైతులు, గ్రామీణులకు ప్రయోజనం కలిగేలా వీలైనన్ని ఎక్కువ పనులను గుర్తించి చేపట్టాలని సీఎస్‌ తెలిపారు. క్షేత్రస్థాయిలో చేపట్టే పనులపై త్వరలోనే ఇంజినీర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించడంతోపాటు శిక్షణ కల్పిస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని