ట్రాక్టర్‌ స్టీరింగ్‌పట్టి పొలం దున్నిన యువతి

సాధారణంగా అమ్మాయిలు ట్రాక్టర్‌ స్టీరింగ్‌ పట్టి పొలంలో దున్నుతుండటం సినిమాల్లోనే చూస్తుంటాం. అలాంటిది నిజ జీవితంలో ఓ యువతి ఇలానే చేసి అందరి మన్ననలూ

Updated : 15 Jun 2020 11:58 IST

పంజాబ్‌: సాధారణంగా అమ్మాయిలు ట్రాక్టర్‌ స్టీరింగ్‌ పట్టి పొలంలో దున్నుతుండటం సినిమాల్లోనే చూస్తుంటాం. అలాంటిది నిజ జీవితంలో ఓ యువతి ఇలానే చేసి అందరి మన్ననలూ పొందుతోంది. మగవాళ్లకు తామేమీ తీసిపోమంటూ ఎంతో ఉత్సాహంగా పొలం పనుల్లో తండ్రికి సాయం చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

పంజాబ్‌లోని సంగ్రూర్‌కు చెందిన 20ఏళ్ల అమన్‌దీప్‌ కౌర్‌ ట్రాక్టర్‌ స్టీరింగ్‌ పట్టి పొలంలో వ్యవసాయం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అబ్బాయిలకు ఏమాత్రం తీసిపోకుండా పొలం పనులన్నీ చక్కగా నేర్చుకుని తండ్రికి వ్యవసాయంలో సాయంగా నిలుస్తోంది. గత మూడేళ్లుగా తన తండ్రికి పొలం పనుల్లో సహాయం అందిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటోంది. వ్యవసాయ క్షేత్రంలో తన కూతురు పనిచేస్తుంటే చాలా సంతోషంగా ఉందని ఆమె తండ్రి చెబుతున్నాడు. స్థానికులు తన కూతుర్ని మెచ్చుకుంటుంటే చాలా గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. తాను లేకున్నా ఒక్కతే పొలం పనులు చూసుకుంటుందని అమన్‌ దీప్‌ తండ్రి వివరించాడు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు