ఎల్జీ ఘటనలో స్టేకు సుప్రీం నిరాకరణ

విశాఖ ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం  నిరాకరించింది. పెండింగ్ పిటిషన్ల విచారణ వచ్చే వారం చివరకు ముగించాలని హైకోర్టుకు

Published : 15 Jun 2020 17:26 IST

అమరావతి: విశాఖ ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. పెండింగ్ పిటిషన్ల విచారణ వచ్చే వారం చివర్లోగా ముగించాలని హైకోర్టుకు సూచిస్తామని పేర్కొంది. సుమోటోగా కేసు తీసుకునే అధికారం ఉందని ఇప్పటికే ఎన్జీటీ స్పష్టం చేసిందని సుప్రీం వ్యాఖ్యానించింది.

అలాగే ఎన్జీటీ ఆదేశాలతో డిపాజిట్ చేసిన రూ.50 కోట్ల పంపిణీని 10 రోజుల పాటు ఆపాలని మధ్యంతర ఆదేశాన్నిచ్చింది. ఎన్జీటీ ఆదేశాలను సవాల్ చేస్తూ అప్లికేషన్ సమర్పించాలని పిటిషనర్‌కు సూచించింది. ఎల్జీ పాలిమర్స్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ... ప్లాంటును సీల్ చేయాలన్న హైకోర్టు ఆదేశాలు సరికావన్నారు. అది రాజ్యాంగ విరుద్ధమని వాదించగా... అలా భావించట్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలనుకోవట్లేదని తెలిపింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని