మహారాష్ట్రలో ప్రారంభం కానున్న పాఠశాలలు

మహారాష్ట్రలో జులై నుంచి విద్యాసంవత్సరాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వంసన్నాహాలు చేస్తోంది. ముందుగా ఉన్నత పాఠశాలలనే..

Published : 15 Jun 2020 23:51 IST

ముంబయి: మహారాష్ట్రలో జులై నుంచి విద్యాసంవత్సరాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ముందుగా ఉన్నత పాఠశాలలనే తెరవాలని యోచిస్తోంది. నెల రోజులుగా కరోనా కేసు లేని జిల్లాలో మాత్రమే పాఠశాలలను తెరవాలనుకుంటోంది. మిగతా జిల్లాల వారికి ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనుంది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ మాట్లాడుతూ.. ‘అన్ని జాగ్రత్తలు వహిస్తూ జులై నుంచి పాఠశాలల తరగతులను ప్రారంభించాలనుకుంటున్నాం. ఒక నెల నుంచి పాజిటివ్‌ కేసులు లేని జిల్లాల్లో మాత్రమే పాఠశాలలు తెరవాలని జిల్లా పరిపాలన అధికారులకు ప్రత్యేకంగా సూచించాం. ముందుగా ఉన్నత తరగతులకు పాఠాలు బోధిస్తాం. టీవీ, రేడియో మాధ్యమాలను ఇందుకు ప్రత్యేకంగా ఉపయోగించనున్నాం. ప్రైమరీ, ఒకటి, రెండో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుకు అనుమతించడం లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి కర్యాచరణను ప్రకటిస్తాం’ అని ఆమె వెల్లడించారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని