రాష్ట్ర బడ్జెట్‌కు ఏపీ మంత్రివర్గం ఆమోదం

కరోనా విస్తరణ, ఇతర ప్రత్యేక పరిస్థితుల మధ్య శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర మంత్రిమండలి మంగళవారం ఉదయం  సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన సమావేశమై బడ్జెట్‌కు ఆమోదముద్ర వేసింది.

Updated : 16 Jun 2020 10:54 IST

అమరావతి: కరోనా విస్తరణ, ఇతర ప్రత్యేక పరిస్థితుల మధ్య శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర మంత్రిమండలి మంగళవారం ఉదయం  సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన సమావేశమై బడ్జెట్‌కు ఆమోదముద్ర వేసింది. ఎప్పుడూ కనీసం రెండు వారాలపాటు నిర్వహించే బడ్జెట్‌ సమావేశాలను ఈసారి రెండు రోజుల్లోనే ముగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై ఈ ఉదయం జరిగే శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.  ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ రాజ్‌భవన్‌ నుంచే ఆన్‌లైన్‌లో ప్రసంగంచనున్నారు.  
మధ్యాహ్నం ఒంటిగంటకు శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్‌ ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్‌ను ఆ శాఖ మంత్రి కన్నబాబు సమర్పిస్తారు. శాసనమండలిలో సభా నాయకుడు, ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ బడ్జెట్‌ ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్‌ను పశుసంవర్థక, మత్స్యశాఖల మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రవేశపెడతారు. మధ్యాహ్నం 2.45లోగా ఉభయసభల్లోను ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని