గోకుల్‌ చాట్‌ యజమానికి కరోనా

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. హైదరాబాద్‌ కోఠిలోని ప్రముఖ గోకుల్‌ చాట్‌ దుకాణం యజమానికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు గోకుల్‌ చాట్‌ను మూసివేయించారు. అలాగే, దుకాణంలోని 19

Published : 16 Jun 2020 15:06 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. హైదరాబాద్‌ కోఠిలోని ప్రముఖ గోకుల్‌ చాట్‌ దుకాణం యజమానికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు గోకుల్‌ చాట్‌ను మూసివేయించారు. అలాగే, దుకాణంలోని 19 మందికి క్వారంటైన్‌కు తరలించారు. గత మూడు రోజులుగా గోకుల్‌ చాట్‌కు వచ్చినవారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. 

రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే కొత్తగా 219 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వడంతో మొత్తం బాధితుల సంఖ్య 5193కి పెరిగిన విషయం తెలిసిందే. ఈ నెలలోనే రెండు వేలకు పైగా కేసులు నమోదవడం, అందులో హైదరాబాద్‌లోనే అత్యధిక కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని