Updated : 27 Jun 2020 14:52 IST

ఈ బూట్లు ధరిస్తే.. సామాజిక దూరం పాటించినట్లే!

కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. దీంతో వైరస్‌ను అరికట్టేందుకు మానవ ప్రయత్నంగా ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నాం. ఇందులో భాగంగా సామాజిక దూరం కూడా పాటిస్తున్నాం. అయితే కొందరు ఈ నిబంధనకు తూట్లు పొడుస్తున్నారు. దుకాణాలు వద్ద కొంత మంది సామాజిక దూరం పాటించకుండా దగ్గర దగ్గరగా నిలుచుంటున్నారు. ఇలా చేస్తే వైరస్‌ వ్యాప్తి తీవ్రమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మన దగ్గరే కాదు.. విదేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ప్రజలు సామాజిక దూరం పాటించేందుకు రొమానియాకు చెందిన ఓ వ్యక్తి వినూత్న బూట్లు రూపొందించాడు. ఇవి వేసుకున్న వ్యక్తులు కచ్చితంగా సామాజిక దూరం పాటించేస్తారు.

గ్రిగొర్‌ లుప్‌ ఓ చెప్పుల వ్యాపారి. లాక్‌డౌన్‌కు ముందు వరకు థియేటర్‌ ఆర్టిస్టులు, జానపద కళాకారులు తదితరులు ఆయన వద్దకు వచ్చి పెద్ద ఎత్తున చెప్పులు, బూట్లు ఆర్డిరిచ్చేవాళ్లు. దీంతో ఆయన వ్యాపారం బ్రహ్మండంగా సాగేది. అయితే కరోనా వైరస్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఆయన దుకాణం మూతపడింది. వ్యాపారమూ నిలిచిపోయింది. దీంతో ఇంట్లోనే ఉంటూ కేవలం నిత్యావసరాల కోసం బయటకు వచ్చేవారట. అయితే లాక్‌డౌన్‌ నిబంధన ప్రకారం నిత్యావసర వస్తువుల దుకాణాల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించాలి. కానీ అక్కడి ప్రజలు ఆ నిబంధనను పాటించకపోవడం లుప్‌కి ఆందోళన కలిగించింది. దీనికి ఏదైనా పరిష్కారం కనుగొనాలని భావించిన లుప్‌ తన వృత్తి నైపుణ్యానికి పని చెప్పాడు. యూరప్‌ బూట్ల కనీసం సైజు 40 (24సె.మీ) కాగా.. వాటి సైజును 75 (46 సె.మీ)కి పెంచాడు. అంటే బూటు మొదలు భాగాన్ని పొడిగించాడు. దాని వల్ల ఆటోమేటిక్‌గా ఇద్దరు వ్యక్తలు మధ్య దూరం పెరుగుతుంది. తాజాగా లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో ప్రస్తుతం ఈ బూట్లు వైరల్‌గా మారాయి. ఈ ఒక జత బూట్లు తయారు చేసేందుకు లుప్‌కి రెండ్రోజులు పడుతోందట. ఇప్పటికే లుప్‌కి ఈ పొడవాటి బూట్లు కావాలని ఐదు ఆర్డర్లు వచ్చాయి. వీటి ధర 115 డాలర్లు (సుమారు రూ. 9 వేలు)అని లుప్‌ చెప్పుకొచ్చాడు. 

- ఇంటర్నెట్‌డెస్క్‌

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని