దేశం వారి త్యాగాలను ఎన్నటికీ మరవదు

భారత్‌-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన కర్నల్‌ సంతోష్‌ కుమార్‌ కుటుంబానికి రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ప్రగాఢ...

Published : 18 Jun 2020 01:08 IST

హైదరాబాద్‌: భారత్‌-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన కర్నల్‌ సంతోష్‌ కుమార్‌ కుటుంబానికి రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయనతోపాటు దేశ భద్రత కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు గవర్నర్‌ నివాళులర్పించారు. ఈ ఘటన మానని గాయంగా మిగిలిపోతుందని ఆమె అభిప్రాయపడ్డారు. సైనికులు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించారని కొనియాడారు. దేశం వారి త్యాగాలను ఎన్నటికీ మరవదని.. యావత్‌ దేశ ప్రజలు అమరులైన సైనికులను స్మరించుకుంటారని ఈ సందర్భంగా తమిళిసై పేర్కొన్నారు. 

లద్దాఖ్‌లో చైనాతో ఆరు వారాలుగా నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభన సోమవారం హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఇరు దేశాలకు చెందిన సైనికులు భౌతిక ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన సైనికాధికారి కర్నల్‌ సంతోష్‌ కుమార్‌ వీరమరణం పొందారు. ఆయనతోపాటు మరో 19 మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ ఘర్షణలో చైనా వైపు కూడా భారీ ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు