సూర్యాపేట బయల్దేరిన సంతోష్‌ కుటుంబం

భారత్, చైనా సరిహద్దు ప్రాంతంలో దేశం కోసం ప్రాణాలర్పించిన సూర్యాపేట జిల్లా వాసి కర్నల్‌ బిక్కుమల్ల సంతోష్‌బాబు(39) భార్య, పిల్లలు బుధవారం

Updated : 08 Dec 2022 19:01 IST

హైదరాబాద్‌: భారత్, చైనా సరిహద్దు ప్రాంతంలో దేశం కోసం ప్రాణాలర్పించిన సూర్యాపేట జిల్లా వాసి కర్నల్‌ బిక్కుమల్ల సంతోష్‌బాబు(39) భార్య, పిల్లలు బుధవారం ఉదయం దిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయనికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి సూర్యాపేటకు రోడ్డు మార్గాన బయలుదేరారు.
భారత్‌ - చైనా సరిహద్దులో సోమవారం రాత్రి చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో కర్నల్‌ సంతోష్‌బాబు అమరుడవడంతో ఆయన స్వస్థలమైన సూర్యాపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంతోష్‌ 16వ బిహార్‌ రెజిమెంట్‌లో పనిచేస్తున్నారు. ఆయనకు తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్‌, తల్లి మంజుల, భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ, కుమారుడు అనిరుధ్‌ ఉన్నారు. సంతోష్‌బాబు చివరిసారిగా గతేడాది మార్చిలో సూర్యాపేటకు వచ్చారు. రెండ్రోజుల క్రితం చెల్లెలు శ్రుతి పెళ్లిరోజు కావడంతో చివరిసారిగా కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కర్నల్‌ అమరుడయ్యారన్న వార్త తెలియగానే సూర్యాపేట పట్టణంలో ఆయన తల్లిదండ్రులు నివాసముండే విద్యానగర్‌ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు బంధువులు వారిని పరామర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని