దొంగిలించారు.. ఏడ్చాడని తిరిగిచ్చారు!

దొంగలకు అసలు దయ, కరుణ అంటూ ఉండవు. సమయ సందర్భాలతో పనిలేకుండా సదరు మనిషి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దొంగతనం చేస్తూ సమజానికి తలవంపులు తెస్తుంటారు. కానీ మాలో సైతం మానవత్వం ఉందని నిరూపించారు దొంగలు.

Updated : 26 Mar 2022 14:18 IST

కరాచీ‌: దొంగలకు అసలు దయ, కరుణ అంటూ ఉండవు. సమయ సందర్భాలతో పనిలేకుండా సదరు మనిషి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దొంగతనం చేస్తూ సమజానికి తలవంపులు తెస్తుంటారు. కానీ మాలో సైతం మానవత్వం ఉందని నిరూపించారు దొంగలు. వివరాల్లోకి వెళితే.. పాకిస్థాన్‌లోని కరాచీలో ఓ డెలివరీ బాయ్‌ను ఇద్దరు దొంగలు అనుసరించారు. అతను ఓ చోట తన ద్విచక్రవాహనాన్ని ఆపి డెలివరీ చేసి వచ్చాడు. అప్పటికే ద్విచక్రవాహనం దగ్గరికి వచ్చిన ఆ దొంగలు ఆ డెలివరి బాయ్‌ నుంచి విలువైన వస్తువులను లాక్కున్నారు. ఈ ఘటనతో షాక్‌కు గురైన సదరు వ్యక్తి కన్నీళ్ల పర్యంతం అయ్యాడు. ఈ ఘటనతో చలించిపోయిన దొంగలు ఆ వస్తువులను అతనికి తిరిగి ఇచ్చేశారు. అనంతరం డెలివరీ బాయ్‌ని ఆలింగనం చేసుకొని కరచాలనం కూడా చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అయ్యింది. ఈ వీడియో చూసిన 2.8 లక్షల మంది నెటిజన్లు ఫిదా అయ్యారు. దీంతో దొంగలకు కూడా అప్పుడప్పుడు జాలి, దయ, కరుణ ఉంటుందంటూ నెటిజన్ల కామెంట్లు పెడుతున్నారు. ‘దయతో కూడిన ఈ చిన్న పని కన్నీళ్లను పెట్టించింది. మనం నివసిస్తున్న ఈ విషపూరిత వాతావరణం గురించి ఈ సంఘటన మనకు చాలా విషయాలను తెలియజేస్తుంది. మానవత్వమే మనల్ని కాపాడుతుంది. దయతో వ్యవహరించండి’ ఓ నెటిజన్‌  పేర్కొన్నారు. మంచి పని చేయడానికి ఎప్పుడూ సంకోచించకూడదు అనడానికి ఇదో పాఠం అని మరో నెటిజన్‌ పేర్కొన్నాడు. 
 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని