తెలంగాణలో కరోనా పరీక్షలపై సుప్రీం స్టే

తెలంగాణలో కరోనా పరీక్షలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈనేపథ్యంలో

Updated : 17 Jun 2020 13:18 IST

దిల్లీ: తెలంగాణలో కరోనా పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆసుపత్రుల్లో మరణించిన వారికి కూడా కరోనా పరీక్షలు చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. అందరికీ కరోనా పరీక్షలు చేయడం సాధ్యం కాదని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్‌ నిబంధనల మేరకే కరోనా పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం వాదనలు పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం... హైకోర్టు ఆదేశాలపై స్టే మంజూరు చేస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని