పూరీ జగన్నాథ రథయాత్రపై స్టే

పూరీ జగన్నాథ రథయాత్రపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కరోనా వల్ల పూరీ జగన్నాథ రథయాత్ర నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రథయాత్ర సబబు కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. రథయాత్రకు

Updated : 18 Jun 2020 14:02 IST

దిల్లీ: భారత్‌లో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక పూరీ జగన్నాథ రథయాత్ర పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కరోనా వల్ల పూరీ జగన్నాథ రథయాత్ర నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో లక్షలమంది తరలివచ్చే అవకాశమున్నందున రథయాత్ర సబబు కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. రథయాత్రకు సంబంధించిన కార్యక్రమాలు కూడా ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 23 నుంచి జగన్నాథ రథయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా.. తాజాగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకునే రథయాత్రను ఆపుతున్నట్టు ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని