Published : 18 Jun 2020 17:43 IST

పెద్ద ఎత్తున పీవీ శత జయంతి ఉత్సవాలు: కేకే

హైదరాబాద్‌: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెరాస ఎంపీ కె.కేశవరావు వెల్లడించారు. శత జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం ఆయన నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఇవాళ సమావేశమైంది. ఈ భేటీలో పలు అంశాలు చర్చించారు. అనంతరం కేకే మీడియాతో మాట్లాడుతూ దేశ ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన ఘనత పీవీదేనని అన్నారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పారు. 
పీవీ శతజయంతిని పురస్కరించుకుని ఈ నెల 28న నెక్లెస్‌ రోడ్డులోని జ్ఞానభూమిలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఆయన పేరు మీద మ్యూజియం, ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. జాతీయ స్థాయిలో ఓ సెమినార్‌ కూడా నిర్వహించాలనే అభిప్రాయం వచ్చిందని పేర్కొన్నారు. పీవీ స్వగ్రామమైన వంగరను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనే అంశంపై చర్చించామని తెలిపారు. 
శత జయంతి ఉత్సవ కార్యక్రమాలను రూపకల్పన చేసి ముఖ్యమంత్రికి అందజేస్తామని, జయంతి రోజున సీఎం కేసీఆర్‌ కార్యక్రమ వివరాలు విడుదల చేస్తారని కేకే వివరించారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని