Updated : 19 Jun 2020 12:19 IST

పంజాగుట్ట ఉక్కు వంతెన ప్రారంభం

హైదరాబాద్‌: నగరంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతోందని హోం మంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. పంజాగుట్టలో నూతనంగా నిర్మించిన ఉక్కు వంతెనను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. రూ.6కోట్ల బల్దియా నిధులతో పంజాగుట్ట శ్మశాన వాటిక వద్ద ఉక్కు వంతెన నిర్మాణం జరిగింది. దీంతో పంజాగుట్ట- జూబ్లీ హిల్స్‌ చెక్‌పోస్టు మార్గంలో ట్రాఫిక్‌ సమస్య తీరనుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ వంతెన నిర్మాణ పనులు లాక్‌డౌన్‌ సమయంలోనూ కొనసాగించినట్లు హోం మంత్రి తెలిపారు. రాబోయే రోజుల్లో దీన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని