ఆర్డినెన్స్‌పై సర్కారుకు టీఎస్‌ హైకోర్టు నోటీసులు

ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్లలో కోత విధిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌పై తెలంగాణ సర్కారుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆర్డినెన్స్‌ సవాలు చేస్తూ విశ్రాంత డీఎఫ్‌వో రామన్‌గౌడ్‌ ....

Published : 19 Jun 2020 15:21 IST

హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్లలో కోత విధిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌పై తెలంగాణ సర్కారుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆర్డినెన్స్‌ సవాలు చేస్తూ విశ్రాంత డీఎఫ్‌వో రామన్‌గౌడ్‌ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధంగా ఉందని వాదించారు. పిటిషనర్‌ వాదనలు విన్న హైకోర్టు.. ఆర్డినెన్స్‌పై 3 వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

పెన్షనర్లకు పూర్తి పింఛను చెల్లించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా పింఛన్లలో కోత ఏ చట్ట ప్రకారం విధిస్తున్నారని ఇటీవల ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో విపత్తులు, అత్యయిక పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల పింఛన్లలో కోత విధించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. ఈ మేరకు గవర్నర్‌ ఆమోదంతో ఆర్డినెన్స్‌ జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని