
సోమవారం సూర్యాపేటకు సీఎం కేసీఆర్
కర్నల్ సంతోష్ బాబు కుటుంబానికి పరామర్శ
హైదరాబాద్: భారత-చైనా సరిహద్దుల్లో వీరమరణం చెందిన కర్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సూర్యపేటకు వస్తున్నారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. కర్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని జగదీష్‌రెడ్డి దంపతులు పరామర్శించారు. ప్రభుత్వం తరఫున ప్రకటించిన ఆర్థిక సాయంతో పాటు గ్రూప్-1ఉద్యోగానికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులను కేసీఆర్ స్వయంగా సంతోష్‌బాబు కుటుంబ సభ్యులకు అందజేస్తారని మంత్రి తెలిపారు.
‘‘సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం తరపున సంపూర్ణ మద్దతు ఉంటుంది. భవిష్యత్తులో కుటుంబ అవసరాల రీత్యా రూ.ఐదు కోట్ల నగదు, ఇంటి స్థలం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇంటి స్థలం సూర్యాపేటలోనా లేదా హైదరాబాద్‌లోనా అన్నది కుటుంబ సభ్యుల ఇష్టం’’
- జగదీష్ రెడ్డి, మంత్రి
Advertisement